ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద కుంభమేళా — 2025

ఈ కార్యక్రమం గురించి

చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా లంటారు; ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి.

పరమహంస యోగానంద

మన ప్రియతమ గురుదేవులు పలికిన ఈ మాటల నుండి ప్రేరణ పొంది, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) కుంభమేళాల సందర్భంగా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రయాగరాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలో వై.ఎస్.ఎస్. శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మేము యోచిస్తున్నాము. ఈ శిబిరంలో హాజరయ్యేందుకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులను ఆహ్వానిస్తున్నాం.

జనవరి 10 నుండి ఫిబ్రవరి 15, 2025 వరకు కుంభమేళా మైదానంలో శిబిరం నిర్వహించబడుతుంది. ఈ సమయంలో పుష్య పూర్ణిమ (సోమవారం, జనవరి 13), మకర సంక్రాంతి (మంగళవారం, జనవరి 14), మౌని అమావాస్య (బుధవారం, జనవరి 29), వసంత పంచమి (సోమవారం, ఫిబ్రవరి 3), మరియు మాఘ పూర్ణిమ (బుధవారం, ఫిబ్రవరి 12) వంటి ప్రత్యేక స్నానపు దినాలు కూడి ఉంటాయి.

కుంభమేళా జరిగినన్ని రోజులు, శిబిరంలో ఉండే భక్తుల బసను సుసంపన్నం చేసేందుకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహిస్తారు. వీటిలో ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలు, కీర్తనలు (భక్తి గీతాలాపన) మరియు సత్సంగాలు ఉంటాయి.

కార్యక్రమ వివరాలు

నమోదు

నమోదు రుసుము ఒక వ్యక్తికి ₹ 2000 ఉంటుంది. 

శిబిరం యొక్క సౌకర్యాలు ముఖ్యంగా వై.ఎస్.ఎస్. భక్తుల కోసం ఉద్దేశించబడ్డాయి. అయినప్పటికీ, వృద్ధులైన తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా తీర్థయాత్రలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు మేము గుర్తించాము. మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత స్నేహితులు/బంధువులు సందర్శనా బృందంలో భాగం కావడానికి ఆసక్తి కలిగి ఉంటే, వారు కూడా పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నాం.

నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది!

డివోటీ పోర్టల్ ద్వారా నమోదు:

త్వరగా మరియు సులువుగా నమోదు చేయడానికి, దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేసి ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోండి.

వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నమోదు:

దయచేసి రాంచీ ఆశ్రమం సహాయ కేంద్రానికి (0651) 6655 506 కాల్ చేయండి లేక ఈ-మెయిల్ చేసి క్రింద పేర్కొన్న వివరాలను అందజేయండి:

  • మీ పూర్తి పేరు
  • వయస్సు
  • లింగము
  • చిరునామా
  • ఈ-మెయిల్
  • టెలిఫోన్ నంబర్
  • వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేక ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
  • మీ బృందంలోని ఇతర సభ్యుల పూర్తి పేరు, వయస్సు, లింగము, మరియు వారు మీతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు
  • మీ ప్రతిపాదిత ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలు (దయచేసి మీ ఆగమనం మరియి నిష్క్రమణలకు సంబంధించి రెండు ప్రాధాన్యతలను సూచించండి)

మీ మొబైల్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపబడే చెల్లింపు లింక్‌ ద్వారా రుసుమును మీరు చెల్లించవచ్చు. మీ మొదటి ప్రాధాన్యత తేదీలలో ఎక్కువ రద్దీ ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ తేదీలు మీకు కేటాయించబడవచ్చు. వీలైనంత వరకు మీ మొదటి ప్రాధాన్యతను గౌరవించడానికి మేము ప్రయత్నిస్తాము. మేము మీ వసతిని ఈ-మెయిల్/ఎస్.ఎం.ఎస్. ద్వారా ధృవీకరిస్తాము, దానిని మీరు కుంభమేళా శిబిరానికి తీసుకురావాలసి ఉంటుంది.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల నమోదు:

శిబిరంలో వై.ఎస్.ఎస్. నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు మరియు నమోదు చేసుకొనేందుకు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులను ఆహ్వానిస్తున్నాం; మరియు భోజనం కూడా ఇక్కడ వారు చేయవచ్చు. శిబిరం వద్ద ఉండే కఠినమైన నివాస ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, దగ్గరలో ఉన్న హోటళ్ళలో నివసించమని మేము సూచిస్తున్నాం; అయినప్పటికీ, వై.ఎస్.ఎస్. శిబిరంలో ఉండడానికి వారు ఇష్టపడితే, మేము వారికి వసతిని ఏర్పాటు చేస్తాము. 

నమోదు కోసం, దయచేసి వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించండి మరియు పైన పేర్కొన్నట్లుగా అన్ని వివరాలను అందజేయండి. రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ తేదీలు మీకు కేటాయించబడతాయి. దయచేసి మీ యాత్రా ప్రణాలికకు సంబంధించిన రెండు విభిన్న ప్రాధాన్యతల తేదీలను తెలియజేయగలరు. 

para-ornament

దయచేసి గమనించండి:

  • మొదట వచ్చినవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదిక: పరిమితమైన వసతి సౌకర్యాల కారణంగా, మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికపై వసతి అవసరం ఉన్నవారి నమోదులు ధృవీకరించబడతాయి.
  • క్యాంప్ వద్ద ఉన్న పరిమితమైన సౌకర్యాల కారణంగా, వై.ఎస్.ఎస్. ద్వారా ఎవరి వసతి ధృవీకరించబడినదో, వారు మాత్రమే శిబిరంలో ఉండడానికి అనుమతించబడతారు. అటువంటి ధృవీకరణ లేని స్నేహితులను మరియు కుటుంబసభ్యులను వెంట తీసుకురావద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
  • మీ నమోదు ధృవీకరించబడి మీరు పాల్గొనలేకపోతే, నమోదు రుసుము తిరిగి ఇవ్వబడదు లేక ఇతర వ్యక్తులకు బదిలీ చేయబడదు.
వసతి మరియు ఆహారం

గరిష్ట సంఖ్యలో భక్తులు తమ స్నానాలు మరియు ఇతర ఆచారాలను నెరవేర్చుకునేందుకు, పరిమితంగా ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకునేలా చూడడానికి, వై.ఎస్.ఎస్. శిబిరం వద్ద ఉన్న వసతి, మీ ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలతో కలిపి నాలుగు పగళ్ళు మరియు మూడు రాత్రులకు పరిమితమై ఉంటుంది.

ఈ శిబిరం వద్ద వసతి, ఇసుకపై వేయబడిన గుడారాలతో, చదును చేయబడిన నేల మీద గడ్డితోనూ, ఆపైన కీలుచాప (టార్పాలిన్) తో కప్పబడి ఉంటుంది.

  • పరుపు, దిండ్లు, మరియు దుప్పట్లు సమకూర్చబడతాయి, కాని మీ స్వంత దుప్పట్లు, దిండు గలేబులను మరియు స్లీపింగ్ బ్యాగ్ లను తీసుకురాగలరు.
  • జనవరి మరియు ఫిబ్రవరి మాసాలలో వాతావరణం ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి, మెత్తని బొంత, స్లీపింగ్ బ్యాగ్, స్వెటర్, క్యాప్ మరియు సాక్స్ వంటి పూర్తి శీతాకాలపు దుస్తులను తప్పకుండా తీసుకురావాలి. ఈ నెలల్లో అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉన్నందున, దోమల నివారణ క్రీమ్, టార్చ్, ఆసనంతో పాటు రెయిన్‌కోట్ లేదా గొడుగు మరియు వ్యక్తిగత ఉపయోగానికి సంబంధించిన ఇతర వస్తువులను కూడా మీరు తీసుకురావచ్చు.

 

భోజనాలకు విడిగా చెల్లించవలసిన అవసరం లేదు.

దయచేసి గమనించండి: గుడారాలలో పురుషులు మరియు స్త్రీలకు విడివిడిగా వసతి ఏర్పాటు చేయబడుతుంది, కావున కుటుంబంతో కలిసి పాల్గొనేవారు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం.

para-ornament

కుంభమేళా వద్ద వై.ఎస్.ఎస్. శిబిరం ఉండే ప్రదేశం యొక్క చిరునామా

మేళా అధికారులు, పాల్గొనే సంస్థలకు ఇప్పటి వరకు స్థలాలను కేటాయించలేదు. అవి అందుబాటులోకి వచ్చినప్పుడు స్థలం యొక్క వివరాలను మరియు రూట్ మ్యాప్ ను మేము తెలియజేస్తాం.

నమోదు చేసుకొన్న వారందరికీ ప్రదేశం యొక్క చిరునామా మరియు అక్కడకు చేరే మ్యాప్ కూడా ఈ-మెయిల్/ఎస్.ఎం.ఎస్. ద్వారా పంపించబడుతుంది.

బేస్ క్యాంప్ చిరునామా

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, ప్రయాగరాజ్
468/270, 468/270, నయీ బస్తీ సోహ్బాటియా బాగ్,
ప్రయాగరాజ్ (అలహాబాద్),
ఉత్తర్ ప్రదేశ్ – 211006

ఫోన్: 9454066330, 9415369314, 9936691302

ఈ-మెయిల్: prayagraj@ysscenters.org

నమోదు మరియు విచారణ కోసం సంప్రదించాల్సిన వివరాలు

పరమహంస యోగానంద శాఖా మఠం – రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ – 834001
ఝార్ఖండ్

ఫోన్: (0651) 6655 506
(సోమవారం – శనివారం, ఉదయం 09:30 – సాయంత్రం 04:30)

ఈ-మెయిల్: kumbha@yssi.org

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి