బాలికల శిబిరంలోని భాగస్వాములతో స్వచ్ఛంద సేవకులు మరియు బాలలతో కూడిన ఒక సామూహిక చిత్రం.
మే 27న స్వామి విశ్వానంద నేతృత్వంలోని నేపథ్య తరగతితో శిబిరం ప్రారంభమయ్యింది.
యోగా కార్యక్రమంతో ఉదయం ప్రారంభమవుతుంది. అక్కడ సరళమైన ఆసనాలను వేయడమెలాగో పిల్లలు నేర్చుకొంటారు.
“గీతాలాపనలోని ప్రాథమిక అంశాలు” అనే ఒక తరగతిలో యోగానందగారి విశ్వగీతాలను పాడడం, మరియు హార్మోనియం ను అభినయించేందుకు నైపుణ్యాన్ని వెలికి తీయడం వంటి వర్క్ షాప్లు ఆ రోజులో కలిసి ఉన్నాయి.
“డ్రెస్ డెజైనింగ్ అండ్ నీడిల్ వర్క్” లో పాల్గొనేవారికి వస్త్రాలు, రంగులు మొదలైన వాటి గురించి పరిచయం చేస్తారు. మరియు పాత వస్త్రాలను పునరుపయోగించే విధానం పరిచయం చేయబడుతుంది.
“డిజిటల్ పరికరాల వాడకంలో ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు” అనే కార్యక్రమంలో వివిధ డిజిటల్ పరికరాల నుండి గరిష్ట ప్రయోజనం పొందేందుకు, వాటిని అర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చో పిల్లలు తెలుసుకొంటారు.
“మిమ్మల్ని మీరెలా చూసుకోవాలి” అనే అంశంపై జరిగిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఒక సుశిక్షిత నిపుణురాలు.
“ఫోటోగ్రఫీలోని ప్రాథమిక అంశాలు” అనే ఒక తరగతిలో వక్త చెబుతున్న వాటిని ఆసక్తిగా వింటున్న బాలికలు.
“ఐ యాం డెక్స్టెరస్” అనే వృత్తివిద్య కార్యక్రమంలో ఫ్యాన్సీ పేపర్ బ్యాగ్ లను తయారు చేయడమెలాగో పిల్లలు నేర్చుకొంటారు.
మహిళల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడుతున్న స్వచ్ఛంద సేవకురాలైన ఒక డాక్టర్.
మరొక స్ఫూర్తిదాయక కార్యక్రమంలో, ఆధ్యాత్మిక సూత్రాలను వారికి పరిచయం చేయడం జరుగుతుంది.
సేదతీర్చే నిమ్మరసం మరియు పండ్ల రసంతో పానీయ విరామ సమయాన్ని పిల్లలు ఆనందిస్తారు.
అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనంలో పౌష్టిక విలువలుగల రుచికరమైన ఆహారం అందించబడుతుంది.
శారీరక మరియు మానసిక వృద్ధి కోసం, తైక్వాండో మరియు వివిధ క్రీడా కార్యకలాపాలలో పిల్లలు పాల్గొన్నారు, వాటిలో…
కుక్క మరియు ఎముక క్రీడ,
వాలీబాల్
మరియు ఇతర క్రీడలు.
శిబిరం ముగింపు రోజు, అనేక వినోద కార్యకలాపాలతో కూడి ఉంటుంది.
నాటక ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం…
కీర్తనలు ఆలపిస్తూ…
యోగాసనాలపై ఒక ప్రదర్శన…
జగన్మాతను స్మరిస్తూ ఒక గీతం…
ఒక చక్కటి నృత్య ప్రదర్శన…
మరియు ఒక సామూహిక గీతాలాపన.
బాలికల శిబిరంలోని భాగస్వాములందరూ ఆశ్రమం పచ్చిక బయళ్లలో మధ్యాహ్న సమయంలో ధ్యానం చేస్తున్నప్పటి దృశ్యం.