ప్రస్తుత వైపరీత్య కాలంలో ఆధ్యాత్మిక సామరస్యాన్ని పెంపొందించడం

Healing-Technique-from-Paramahansa-Yogananda-led-by-Swami-Chidananda-giri

స్వామి చిదానంద గిరి గారి నుండి ఒక సందేశం

[2018లో స్వామి చిదానందగారు ప్రచురించిన లేఖ నుండి తీసుకోబడినది. నాలుగు సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీ, దీనిలోని ప్రాథమిక సందేశం నేడు ఇంకా ఎంతో ముఖ్యమైనది – విభజన మరియు అలజడులను అధిగమించడానికి మనం గుర్తించవలసిన వైఖరులు మరియు సామర్థ్యాలను తెలియజేస్తుంది.]

ప్రియతములారా,

నా రోజువారీ ధ్యానాలలో నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన గురుదేవులు పరమహంస యోగానందగారి అందమైన ఆధ్యాత్మిక కుటుంబం గురించి ఆలోచిస్తుంటాను. భగవంతుడు మరియు గురుదేవులు మీ జీవితాలకు మరియు మీ ఆధ్యాత్మిక ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేయాలని మరియు వారి ప్రేమ మరియు జ్ఞానంలోని లోతైన స్థిరమైన భద్రతను అనుభవించేలా మీకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. శాంతి, సామరస్యం, పరస్పర సహకారం మరియు నైతిక నియమాలతో కూడిన ఆనందకరమైన జీవనం గడపాలని భగవంతుని ఉద్దేశం మరియు ప్రపంచ కుటుంబంలో పెరుగుతున్న వ్యతిరేక వర్గాల మధ్య ప్రస్తుత సమాజంలో ప్రచారం పొందుతున్న విభజనవాదం మరియు వికారాల గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భక్తులు చాలా ఆందోళనగా ఉన్నారని నాకు తెలుసు. ఈ ద్వంద్వాత్మక ప్రపంచం ఎల్లప్పుడూ వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధభూమిలా ఉంటోంది, ఉండబోతోంది. అయితే ఇంటర్నెట్ మరియు ఇతర సామూహిక ప్రసార సాధనాల ద్వారా భగవంతుని శాశ్వత సత్యాలైన మంచితనం మరియు నైతిక విలువలపై ప్రస్తుత యుగంలో దౌర్జన్యం స్పష్టముగా పెరిగి అధర్మము మరియు ప్రతికూలతల తీవ్రమైన దాడి వల్ల మన అంతరంగ మరియు బాహ్య వాతావరణం చొరబాటుకు గురవుతోంది.

అయితే భవిష్యత్తు గురించి మనం నిరుత్సాహపడనవసరం లేదు. సామాజిక ప్రసారసాధనాలు ఒక వ్యక్తి యొక్క స్వరాన్ని పెద్దగా చేసి, తద్వారా ఆ వ్యక్తి తక్షణ స్థానానికి మించి లెక్కలేనంతమందిని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి సత్యం, సౌందర్యం, మంచితనం, జ్ఞానం, కరుణ వంటి వాటి ప్రభావాన్ని విస్తరించడానికి సమానమైన లేదా గొప్ప సంభావ్యత ఉంది – ఇవన్నీ ప్రతి మానవుడిలో ఉన్న దేవుడి రూపమైన ఆత్మ యొక్క స్వర్గలోకపు లక్షణాలు. ఇది ఎలా ఉంది? క్రియాయోగ ధ్యానం ద్వారా శక్తివంతమైన వివేకం పొందిన ప్రతి హృదయం మరియు మనస్సు అనే ప్రసార కేంద్రాల ద్వారా ప్రపంచ పర్యావరణంలోని పరమాణువులలోకి మరియు అన్ని జీవుల చేతన లేదా అవచేతనలోకి ప్రసరించే ప్రకంపనశక్తి ఏదైనా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం కంటే చాలా విస్తృతమైనది మరియు అనంతమైన అనుగ్రహానికి మూలమైన భగవంతునితో అనుశ్రుతిలో ఉంటుంది. ప్రతి రోజు నిబద్ధతతో ధ్యానం చేయడం ద్వారా మరియు ప్రపంచ ప్రార్థనా మండలిలో పాల్గొనడం ద్వారా మీరు ఎంత మేలు చేకూర్చగలరో ఎప్పటికీ మరువకండి.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ మరియు క్రియాయోగం వంటి మార్గానికి ఆకర్షించబడిన కాంతి మరియు సత్యం యొక్క దివ్య యోధుడు భూమిపై ఆధ్యాత్మిక సామరస్యాన్ని పెంచడానికి బాహ్యమైన మరియు అంతర్గత మార్గాలను ఉపయోగించవచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మరియు మీ చైతన్యంలో ఉన్న వికారమైన అహంకార లక్షణాలను మార్చుకోవడానికి మొదటి ప్రాధాన్యమిస్తూ పరిస్థితులు బాహ్యంగా మీ ముందు అపవిత్రమైన వాటిని ఉంచినప్పుడు వాటితో సహకరించకుండా ఉండేందుకు భయపడకండి. కాని గుర్తుంచుకోండి, ఏది ఏమైనా వినయం లేకపోవడము, శత్రుత్వం అనేవి మీరు ప్రతిఘటిస్తున్న వాటి వైపు మిమ్మల్ని త్వరగా పడవేయవచ్చు. ఆధ్యాత్మికత మరియు సత్యము బాహ్యమైన అనుబంధం ద్వారా నిర్వచించబడవు.

ప్రపంచ సంఘటనల నాటకం మీద సామూహిక కర్మ, మన ప్రస్తుత యుగంలోను, ఇతర యుగాలలోను — ఏ విధమైన ప్రభావం కలిగిస్తుందో పరిమిత మానవ మేధస్సు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. అంతిమంగా ఒక దేశం యొక్క ఆరోగ్యం మరియు సామరస్యం ఆ సమాజంలో ప్రబలంగా ఉన్న మంచి, చెడుల మిశ్రమ సామూహిక కర్మల వల్ల ఏర్పడుతుంది. మన కాలంలోను – మరే ఇతర కాలంలోనైనా – అవసరమైనదేమిటంటే చాలా మంది వ్యక్తుల్లోని దుష్టత్వం, అనైతికత, అధర్మ జీవనవిధానం వంటి చెడ్డతనాన్ని తొలగించడం. అన్ని మతాలలో ఒకేలా ఉన్న, ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. బోధలలో స్రవించిన కొన్ని దివ్యసత్యసూత్రాలను ప్రతిరోజూ ఆచరించడమే, మీరు ఈ చీకటి సమయాలకు కాంతిని అందించగల అత్యంత శక్తివంతమైన మార్గం. ఇది దేవుని అనుగ్రహంతో అజేయమైన శక్తితో మీ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు మీ ఆలోచనలు మరియు చర్యలను ఉత్తేజపరచుకొనేందుకు మీరు తీసుకోగల క్రియాశీలకచర్య. ప్రతిరోజు పాఠాల నుండి కొంచెం చదవండి, ఉదాహరణకు: ఆధ్యాత్మిక దైనందిని నుండి – లేదా భగవద్గీత నుండి లేదా బైబిల్ నుండి – ఉదహరించబడిన వాక్యాలను ఆ రోజు అంశంగా తీసుకోండి. వార్తల్లో మీరు ఏదైనా విన్నప్పుడు మీ అంతర్గత శాంతి మరియు సమతుల్యత దెబ్బతింటుంటే, చదివిన ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకోండి మీరు దానిని దృవీకరించడం మరియు వ్యక్తీకరించడం కోసం మీరు మీ సంకల్పం ద్వారా ఆ ప్రతికూలతను తటస్థీకరించడంలో సహాయపడుతున్నారని తెలుసుకోండి. మన గురుదేవుల యొక్క అసాధ్యమైన, సానుకూల స్ఫూర్తిని అనుసరించడం వల్ల, భగవంతునితో ఐక్యతను కలిగించే పవిత్రమైన క్రియాయోగ శాస్త్రాన్ని సాధన చేయడంవల్ల, మనం అనుభవిస్తున్న ఇప్పటి కాలాల కోసం ప్రత్యేకంగా ప్రపంచానికి క్రియాయోగాన్ని తీసుకురావడానికి వారు నియమించబడ్డారని, ఈ ప్రపంచాన్ని గమనిస్తున్న భగవంతుడు మరియు మహాత్ముల సహాయంతో అజ్ఞానాధారిత భయాలు మరియు ద్వేషాల సంకెళ్ళ నుండి మానవాళికి భగవంతుని సామరస్యం మరియు సమతుల్యత ఉత్పత్తి చేసే ప్రేమ మరియు ఆనందకరమైన చైతన్యం కలిగించవచ్చని మీకు మీరు నిరూపిస్తారు.

మీకు ఎదుటపడిన ప్రతి వ్యక్తిలోను — వారి అభిప్రాయాలు మీతో సరిపడకపోయినా — వారిలోని మంచితనం మరియు ఆధ్యాత్మిక చైతన్యం యొక్క భావాల మీద దృష్టి పెట్టండి. ఈ విధంగా మీరు దృష్టిపెట్టడం వల్ల, ప్రపంచంలో భగవంతుని సాన్నిధ్యం ఎక్కువగా వ్యక్తమవడాన్ని తెలుసుకుంటారు. భగవంతుడు భగవద్గీతలో ఈ విధంగా వెల్లడించినాడు: “నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను.” ఇతరులను ఆత్మలుగా చూడండి. ఆ విధంగా గౌరవప్రదమైన మరియు ప్రశంసాపూర్వక వైఖరితో ఉండడం వల్ల సూక్ష్మంగా మీ నుండి ఇతరులు — ఇతరుల నుండి మీరు స్వీకరిస్తారు — ఆత్మ గుణముల యొక్క ఒక గొప్ప వ్యక్తీకరణ.

ప్రపంచంలోని తప్పుల గురించిగాని, మీ స్వంత జీవితంలోని తప్పుల గురించిగాని తరచుగా ఆలోచిస్తున్నట్లు, చదువుతున్నట్లు, మాట్లాడుతున్నట్లుగా మీకు అనిపిస్తే మీ దృష్టిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ సమయాన్ని మరియు శక్తిని మంచి ఆలోచనలు ఆలోచించడానికి, ప్రార్థించడానికి, సేవ, దాతృత్వానికి సంబంధించిన పనులు ఆచరించడానికి మరియు దయ, అవగాహన, ఉత్సాహం వెలువరించే వ్యక్తిగా మారడానికి వినియోగించండి. అలా చేయడం ద్వారా మీరు మీ చైతన్యాన్ని మరియు ఇతరుల చైతన్యాన్ని ఉన్నత స్థాయికి చేర్చగలుగుతారు. మీరు కనుక విశ్వాసంతో ధ్యానం చేసినట్లయితే, మీ లోపల, ఆలోచనలు నిశ్చలంగా ఉన్న లోతైన పవిత్ర మందిరంలోకి ప్రవేశించినప్పుడు భగవంతుడు మీ ఆత్మలో నిక్షిప్తం చేసిన ప్రేమ పెరుగుతున్నట్లు అనుభూతి చెందుతారు మరియు ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వగలుగుతారు. మీ శ్రేయస్సు మీద, మీ చుట్టుప్రక్కల వారి శ్రేయస్సు మీద మరియు ప్రపంచంలోని మానవులందరి మీద మీ ఆధ్యాత్మిక ప్రయత్నాల వల్ల కలిగే అనుకూల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. గురుదేవులు ఇలా అన్నారు, “ఎవరైతే శరీరాన్ని, మనసును, ఆత్మను దివ్యత్వంతో సమన్వయపరచి తమకు తాము ఉన్నతికి చేర్చుకోవాలని ప్రతి దారిలో ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటివారు తమ జీవితంలోనే కాక, వారి కుటుంబంలోను, ఇరుగుపొరుగువారిలోను, దేశంలోను మరియు ప్రపంచంలోను మంచి కర్మను సృష్టిస్తారు.”

మీ జీవితంలో ఆయన కాంతిని మరియు ప్రేమను ప్రకాశింపజేయడానికి మీరు పోరాడుతున్నకొద్దీ, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీరు పొందెదరు గాక,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి