ప్రార్థన సేవ (నిడివి: 15 - 20 నిమిషాలు)
క్రింద వివరించిన ప్రార్థన సేవ ప్రతి వారం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన సమూహాలలో నిర్వహించబడుతుంది. ఇది శాస్త్రీయ ప్రార్థన యొక్క రెండు ప్రాథమిక అంశాలను ఉపయోగిస్తుంది: అవి ఆలోచన మరియు శక్తి. ముందుగా, దేవుని సహాయంతో పరిపూర్ణత మరియు అనుబంధం యొక్క ఆలోచనలు అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రసారం చేయబడతాయి. తరువాత, పరమహంస యోగానందగారు బోధించిన సాంకేతిక ప్రక్రియ ద్వారా, సహాయం అవసరమైన వారికి స్వస్థత శక్తి పంపబడుతుంది.
- ప్రారంభ ప్రార్థన.
- ఐచ్ఛికం: పరమహంస యోగానందుల వారి రచనల నుండి సంక్షిప్త స్ఫూర్తిదాయకమైన పఠనం మరియు/లేదా ఆయన పాడిన ఆధ్యాత్మిక పాటల (Cosmic Chants) నుండి ఎంపిక చేసినవి.
-
సంక్షిప్త ధ్యానం. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ధ్యాన ప్రక్రియలు మీకు తెలిస్తే వాటిని ఆచరించి, దేవుని యొక్క స్వస్థత ఉనికికి ఆలోచనలను జోడించండి. అప్పుడు ప్రార్థన మండలి సహాయం కోరిన వారందరి కొరకు మానసికంగా గాఢంగా ప్రార్థించండి. అదనంగా, మీరు మీ ప్రియమైన వారి కోసం లేదా మీ స్వంత ఇబ్బందులను అధిగమించడంలో దైవిక సహాయం కోసం ప్రత్యేకంగా ప్రార్థించవచ్చు.
కనుబొమ్మల మధ్య బిందువు వద్ద దృష్టిని కేంద్రీకరించి, దేవుని ప్రకంపన కాంతిని ఊహించండి. ప్రార్థనను అభ్యర్థించిన వారందరికీ మీ ఆధ్యాత్మిక నేత్రము ద్వారా కేంద్రీకృతమైన స్వస్థత ప్రకంపన కిరణాలను పంపుచున్నది సర్వ శక్తివంతమైన దైవిక చైతన్యమే అని భావించండి. మీరు కనుబొమ్మల మధ్య శాంతి, తిమ్మిరి లేదా బరువు అనుభూతిని అనుభవించవచ్చు. ఏదే మైనా, మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో వారిని దేవుని స్వస్థత శక్తి ఆశీర్వదిస్తుందని సందేహం లేకుండా తెలుసుకోండి. - ఐచ్ఛికం: ధ్యాన వ్యవధి తరువాత, కావాలనుకుంటే, చిన్న ధృవీకరణను ఉపయోగించవచ్చు. (పరమహంస యోగానందగారి పుస్తకం శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు 5వ అధ్యాయంలో సూచనలు చూడవచ్చు.)
- పరమహంస యోగానందగారు బోధించిన స్వస్థత ప్రక్రియను ఆచరించండి.
- ప్రపంచ శాంతి కొరకు ముగింపు ప్రార్థన.