క్రిస్మస్ ధ్యాన వనరుల పేజీ — క్రీస్తు చైతన్యం స్వీకరించడానికి సన్నద్ధమవ్వండి!

క్రిస్మస్ తరుణంలో మీరు గాఢంగా ధ్యానిస్తే, క్రీస్తు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు, మీ అందరికీ ఈ ప్రత్యేక ఆశీస్సులు నేను అందజేస్తున్నాను.

— పరమహంస యోగానంద

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ భక్తులు మరియు స్నేహితుల కోసం సంవత్సరాంత పర్వదిన తరుణంలోని ప్రధానాంశాలలో రోజంతా క్రిస్మస్ ధ్యానం ఒకటి, ఈ సంప్రదాయాన్ని పరమహంస యోగానందగారు 1931లో ప్రారంభించారు, మరియు చాలా సంవత్సరాలు దీనిని ఆయన వ్యక్తిగతంగా నిర్వహించారు.

ప్రతి సంవత్సరం డిసెంబరు మధ్యలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలు, కేంద్రాలు, మండళ్ళు 8-గంటల ధ్యానం నిర్వహిస్తారు.

  • దివ్య అవతారునిగా ఏసుక్రీస్తు జననాన్ని గౌరవిస్తూ, మరియు
  • ఏసులోను మరియు విముక్త గురువులందరి జీవితాలలోను పరిపూర్ణంగా వ్యక్తమైన అదే విశ్వజనీన క్రీస్తు చైతన్యం (కుటస్థ చైతన్యం లేదా కృష్ణ చైతన్యం) యొక్క అనుభవాన్ని గాఢంగా పొందడానికి.

ఈ ధ్యానం యొక్క వివరాలను తెలుసుకోవడం కోసం దయచేసి మీ పరిసర ప్రాంతంలోని వై.ఎస్.ఎస్. కేంద్రాన్ని సంప్రదించండి.

నిజమైన ఉన్నతి, ఉద్ధారణ కలిగించే అనుభవం కోసం దీర్ఘకాలిక భక్తులతో పాటు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనల కోసం కొత్తగా చేరిన వారిని కూడా పాల్గొనమని మేము ప్రోత్సహిస్తున్నాము.

పరమహంసగారు పిలిచినట్లుగా ఈ “ఆధ్యాత్మిక క్రిస్మస్” నుండి అత్యధిక ప్రయోజనం పొందడానికి సామాజిక ఉత్సవాల పర్వదినాలకు ముందు, రోజంతా జరిగే ధ్యానం కోసం సన్నద్ధం కావడం సహాయకారిగా ఉంటుంది.

సంవత్సరంలోని ఈ కాలంలో మీకు లభించే అద్భుతమైన ఆశీస్సుల స్వీకారానికి మీ చైతన్యాన్ని అనుసంధానించడం ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి ఈ పేజీలో మీరు సహాయక వనరులను కనుగొంటారు:

  • శ్రీ పరమహంస యోగానందగారి క్రిస్మస్ సందేశం
  • ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల నుండి ప్రేరణ (ఆడియో, వీడియో మరియు వచన రూపంలో)
  • మీ ధ్యానాలను గాఢతరం చేసుకునే మార్గాలు (ఆడియో)
  • క్రిస్మస్ స్మారక ధ్యానంలో పాల్గొనండి — వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం
లైట్హౌస్-ఆస్తి

శ్రీ పరమహంస యోగానందగారి క్రిస్మస్ సందేశం

ఏసు యొక్క అసలైన బోధలపై పరమహంసగారి ప్రవచన వ్యాఖ్యానం, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ వితిన్ యు (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You), అనుబంధ విభాగంలో ప్రచురించబడిన పరమహంస యోగానందగారి క్రిస్మస్ సందేశాలలో ఒకటి ఇక్కడ పొందుపరచబడింది. ఈ తరుణంలో — మరియు అన్ని కాలాల్లోనూ — అందరి పట్ల ప్రేమతో, దివ్య క్రీస్తుచైతన్యంతో ఆంతరిక ఏకత్వం పొందిన ఏసు నిదర్శనమును అనుసరించడం ద్వారా మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికం చేయమని ఈ సంక్షిప్త మరియు శక్తివంతమైన సందేశంతో, ఆయన మనలను ప్రోత్సహిస్తున్నారు.

ఒక నిజమైన క్రీస్తులా ఉండండి

“ఇది నా క్రిస్మస్ గీతం, దైనందిన ధ్యానం ద్వారా మీరు మీ చైతన్య ఊయలని సిద్ధం చేసుకోండి, అక్కడ ఉంచబడిన అనంత బాలక్రీస్తును మీరు దర్శిస్తారు. ఈ పవిత్ర కాలంలో ప్రతి దినము దివ్యానుసంధానం యొక్క నిజమైన క్రిస్మస్ తరుణంగా మారే వరకు గాఢంగా మరియు దీర్ఘంగా ప్రార్థించండి.

“విశ్వజనీన సోదరభావంతో ప్రేమ, శాంతి, క్షమ మరియు సంతోషం అనే ఆత్మ గుణాల ఆధ్యాత్మిక బహుమతులను ఒకరికొకరు మరియు నిజమైన ఆత్మలందరితో పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా, భౌతిక కానుకలతో క్రిస్మస్ చెట్టు వద్ద జరిగే సామాజిక వేడుకను ఆధ్యాత్మికం చేయండి.

“దేశాభిమానము యొక్క కొలిమిలో యుద్ధాలు మరియు అపార్థాల చీకటిని తరిమికొట్టడానికి ప్రపంచంలోని అన్ని దేశాల పట్ల ప్రేమ అనే మనోహరమైన కాంతిని వెలిగించండి. నిజమైన క్రీస్తు కుమారునిగా మీలో పవిత్ర సంకల్పం చేయ౦డి: ‘నేను నా స్వంత ప్రజలను ప్రేమి౦చినట్లే దేవుని ప్రజల౦దరినీ ప్రేమిస్తాను.’

ఇంట్లో, వ్యాపారంలో, చర్చిలో, సమాజంలో, రాజకీయాల్లో, అంతర్జాతీయ అవగాహనలో క్రీస్తు ఐక్య ప్రాబల్యంలో జీవించండి; మరియు ఏసు ప్రభువు మీతో ఉంటాడు. మీరు ఒక క్రీస్తు-వాదిగా — ఒక క్రీస్తుగా — క్రీస్తుతో ఐక్యమవుతారు.”

లైట్హౌస్-ఆస్తి

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల నుండి ప్రేరణ

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) యొక్క ఐదవ మరియు ప్రస్తుత అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారి 2020 క్రిస్మస్ సత్సంగం నుండి ఒక వీడియో భాగాన్ని క్రింద చూడండి, తరువాత వరుసగా రెండవ, మూడవ మరియు నాల్గవ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల నుండి మరింత ప్రేరణాత్మక, మార్గదర్శక ధ్యానాన్ని వీక్షించవచ్చు.

పవిత్ర పర్వదిన ఆచరణముల సందేశం

స్వామి చిదానంద గిరి ద్వారా

పర్వదిన తరుణంలో వ్యాపించిన దైవ కృప గురించి మరియు దాని పరిణామాత్మక శక్తిని పొందేందుకు మనల్ని మనం ఎలా సంసిద్ధం చేసుకోవాలి అనే ఒక ప్రత్యేక సందేశాన్ని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులయిన స్వామి చిదానంద గిరి పంచుకున్నారు. ఏసు జననం గురించి కొత్త నిబంధన నుండి ఒక అంశాన్ని ఆయన వినిపించారు, ధ్యానాన్ని అభ్యసించేవారి కోసం ఈ కథ యొక్క లోతైన మరియు సార్వత్రిక భావాన్ని సుస్పష్టం చేయడానికి పరమహంసగారి నుండి జ్ఞానాన్ని పంచుకున్నారు.

Play Video

ఈ తరుణపు ఆంతరిక ఆధ్యాత్మిక సౌందర్యం

రాజర్షి జానకానంద ద్వారా

పరమహంస యోగానందగారికి రాజర్షి జనకానంద ప్రప్రధమ ఆధ్యాత్మిక వారసులు, 1952 నుండి 1955లో ఆయన పరమపదించే వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క రెండవ అధ్యక్షులుగా పనిచేశారు. 1952లో రాజర్షి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులందరికీ ఇచ్చిన క్రిస్మస్ సందేశం ఇది.

“ఈ పావన క్రిస్మస్ తరుణంలో నా హృదయంలోని గాఢమైన ఆనందంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకు పూర్వం ఏసు రాకతో మనం జరుపుకునే క్రీస్తు చైతన్యం యొక్క సర్వవ్యాప్త ప్రేమను, ఆనందాన్ని, శాంతిని వారి హృదయాలలో చైతన్యంతో స్వీకరించడానికి — క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని ఆస్వాదించే జనులు చాలా అరుదుగా ఉన్నారు.

“ఈ సమయంలో గురు పరంపర మరియు మన గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశీస్సుల ద్వారా మరియు వారి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోధనల ద్వారా, అంతరిక ఆధ్యాత్మిక సౌందర్యంలో నా దృష్టి వికసించి; సర్వవ్యాపకుడైన క్రీస్తు యొక్క అనంత ప్రేమతో నా హృదయం నిండిపోయింది.

“ఈ దివ్యప్రేమ మరియు ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా వినయపూర్వక అభిలాష. మన హృదయాలలో మరియు మనస్సులలో ఏసుక్రీస్తు మరియు మన గురువులతో కలిసి ప్రపంచ క్రిస్మస్ చెట్టు వద్ద అన్ని వైపులా చేరి, వారి సందేశమైన మానవాళికంతటికీ శాంతి, క్షమ మరియు ప్రేమ, గ్రహణశీల శ్రవణేంద్రియములకు చేరాలని ప్రార్థిద్దాం. ప్రజలందరూ సత్యం మరియు అవగాహన యొక్క వెలుగులో మెల్కొందురుగాక! ‘ఉన్నతమైన దేవునికి శోభ, మరియు భూమిపై మానవులకు శాంతి, సుహృద్భావం,’ అని దివ్య బృందగానంతో కలిసి ప్రతి హృదయాన్ని పాడనివ్వండి.

ప్రతి దినము క్రిస్మస్ గా ఉండనివ్వండి

శ్రీ దయామాత ద్వారా

1955 నుంచి 2010లో ఆమె పరమపదించే వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కు మూడవ అధ్యక్షురాలిగా శ్రీ దయామాత సేవ చేశారు. ఏసుక్రీస్తు మరియు భగవాన్ కృష్ణుల గురించి శ్రీ పరమహంస యోగానందగారికి ఉన్న సంపూర్ణ అవగాహన, తన స్వీయ జీవితంపై చూపిన ప్రభావం గురించి ఆమె వివరించారు మరియు ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో తన మొదటి క్రిస్మస్ గురించి వర్ణించారు.

క్రిస్మస్ కోసం మార్గదర్శక ధ్యానం

శ్రీ మృణాళినీమాత ద్వారా

2011 నుండి 2017లో ఆమె పరమపదించే వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాల్గవ అధ్యక్షురాలిగా పనిచేసిన శ్రీ మృణాళినీమాత నేతృత్వంలో 2002 డిసెంబర్ 23న ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో రోజంతా జరిగిన క్రిస్మస్ ధ్యానం నుండి కొన్ని అంశాలు. (ఈ జ్ఞానాన్ని, ప్రేరణను మరింత గాఢంగా గ్రహించడానికి సహాయపడేలా కొన్ని స్వల్పకాల మౌన విరామాలు పాటించడం జరిగింది.)

లైట్హౌస్-ఆస్తి

మీ ధ్యానాలను గాఢతరం చేసుకొనే మార్గాలు

స్వామి భక్తానంద గిరి ద్వారా

స్వామి భక్తానంద గిరి, 1971 నుండి 2005లో ఆయన పరమపదించే వరకు కాలిఫోర్నియాలోని హాలీవుడ్ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఆలయంలో అగ్ర సన్యాసిగా సేవ చేశారు. ఎస్.ఆర్.ఎఫ్. హాలీవుడ్ ఆశ్రమ కేంద్రంలోని ఇండియా హాల్లో ధ్యానంపై అనేక సంవత్సరాలు వార్షిక తరగతులు నిర్వహించారు. ఆయన ప్రసంగాల సారాంశం నుండి తీసుకోబడిన ఆడియో ఇక్కడ పొందుపరచబడింది.

నిడివి: 5 నిమిషాలు

ఇతరులతో పంచుకోండి