దైనందిన ధ్యానాలు, ఆధ్యాత్మిక సలహాలు, సత్సంగాలు, సాధనా సంగమాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు స్మారకోత్సవాలతో వై.ఎస్.ఎస్. భక్తులకు సేవలందించే నిమిత్తం చెన్నై ఏకాంత ధ్యాన వాసంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు శాశ్వతంగా ఉండేందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఆమోదం తెలిపారు. అప్పటి నుండి, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, ఇంకా చాలామంది భక్తులు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం మరియు మార్గదర్శకత్వం కోరుతున్నందున రాబోయే కాలంలో ఈ ఆవశ్యకత ఇంకా పెరుగుతుందని ఆశించవచ్చు.
ప్రస్తుత సౌకర్యాలతో ఎదురవుతున్న సవాళ్ళు
ప్రస్తుతమున్న సౌకర్యాలు — మౌలికంగా ఒక ఏకాంత ధ్యాన వాసం కోసం రూపొందించినవి — ఇప్పుడు పెరిగిన ఆవశ్యకతలకు సరిపోనివి. ఆశ్రమం విస్తరించిన పరిస్థితుల్లో సహాయకారిగా ఉండేందుకు వసతి, వంటశాల, భోజన ప్రాంతాలు, పరిపాలన మరియు ఇతర అనుబంధ సౌకర్యాలను ముఖ్యంగా అభివృద్ధి చేయవలసి ఉన్నది.
కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- అతిథుల వసతి: వసతులు చాలావరకు డార్మిటరీ రీతిలో ఉంటాయి. అందువల్ల, చాలామంది భక్తులు స్నానపు గదులతో కూడిన ప్రత్యేక గదులను అభ్యర్థిస్తున్నారు.
- సేవకుల వసతి: వంటశాల, స్వాగత విభాగం మరియు ఇతర ప్రదేశాలను పర్యవేక్షించే పూర్తి కాలపు సేవకుల గదులకు కొరత ఉన్నది.
- సన్యాసుల నివాసాలు: పునర్నిర్మించబడిన మాజీ సంరక్షకుడి చిన్న నివాసంలో సన్యాసులు ప్రస్తుతం నివసిస్తున్నారు. ఇక్కడ కార్యాలయ స్థలం, భోజన ప్రాంతం, వంటశాల మరియు లాండ్రీ వంటి సౌకర్యాలు లేవు.
- కార్యాలయం మరియు స్వాగత విభాగం: పెరిగిన కార్యాలయ పనిభారాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న కార్యాలయ స్థలాన్ని పెంచవలసి ఉంది. ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా, ఒక చెట్టు క్రిందన నమోదు మరియు స్వాగత విభాగం నిర్వహించబడుతున్నాయి. ఇంకా, పుస్తక ప్రదర్శనకు మరియు విక్రయాలకు తగినంత స్థలం లేదు.
సౌకర్యాల మధ్యంతర అభివృద్ధి యొక్క అవసరం
ఆశ్రమాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించబడుతోంది. ఈ లోపల సజావుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు, మరియు భక్తులు, సేవకులు, సన్యాసులకు సౌకర్యవంతమైన వసతి మరియు సేవలను అందించేందుకు ప్రస్తుత సౌకర్యాలను మెరుగుపరచవలసి ఉన్నది.
ప్రతిపాదిత సౌకర్యాల అభివృద్ధి
వసతి సౌకర్యాల భవన నిర్మాణ ఆకృతులు క్రింద ఇవ్వబడ్డాయి.
- పురుషుల వసతి: మొదటి అంతస్తులో ఉన్న పెద్ద డార్మిటరీని స్నానపు గదులతో కూడిన ఆరు రెండు-పడకల గదులుగా మార్చాలనే యోచన ఉంది. మరియు, రెండవ అంతస్తులో నాలుగు పడకలతో మరియు స్నానపు గదులతో కూడిన నాలుగు పెద్ద గదులుగా మార్చాలనే యోచన ఉంది.
- స్త్రీల వసతి: అదే విధంగా, మొదటి అంతస్తులోని డార్మిటరీని స్నానపు గదులతో కూడిన ఆరు రెండు-పడకల గదులుగా మార్చాలనే యోచన ఉంది. రెండవ అంతస్తులో నాలుగు పడకలతో మరియు స్నానపు గదులతో కూడిన మూడు పెద్ద గదులు, మరియు స్నానపు గదితో కూడిన ఒక రెండు-పడకల గది నిర్మించాలనే యోచన ఉంది.
- కార్యాలయ ప్రాంతం: ఆహ్వానం కోసం స్థలం, పుస్తక ప్రదర్శన మరియు విక్రయాలు, జమాఖర్చుల విభాగం, మరియు సేవకుల నివాసం, ఒక సామానుగది మరియు ఒక సాధారణ స్నానాల గదిని క్రొత్త కార్యాలయ ప్రాంతంలో నిర్మించవలసి ఉంది. ఆశ్రమం యొక్క సంస్థాగతమైన మరియు బహిరంగవ్యాప్తి కార్యకలాపాలను ఈ ప్రాంతం సమర్ధవంతంగా నిర్వహించగలదని భావించవచ్చు.
- సన్యాసుల నివాసాలు: ఆరు గదులు, స్నానపు గదులు, కార్యాలయ ప్రాంతం, సమావేశ గది, ఒక వంట గది మరియు భోజన సదుపాయాలతో కూడిన ఒక ప్రాంతం, సన్యాసుల వినియోగం కోసం నిర్మించబడుతుంది.
- సేవకుల నివాస సముదాయం: ఇప్పటి నివాసాలను సన్యాసులు ఖాళీ చేయగానే, దంపతులైన సేవకుల కోసం స్నానపు గదులతో కూడిన ఆరు నివాసాలుగా అవి పునర్నిర్మించబడతాయి.
విశాలమైన నివాసాల ఏర్పాటు, మెరుగైన గృహోపకరణాలు, పెద్ద స్నానపు గదులు, అదనపు సదుపాయాలతో మెరుగుపరచబడిన కార్యాలయ ప్రదేశం — ఈ నవీకరణలన్నీ ఆశ్రమ మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి.
వ్యయం అంచనా
వీటిని అభివృద్ధి చేయడానికి మొత్తం అంచనా విలువ ₹ 4 కోట్లు. ఈ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు, మరింత ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక ప్రతిఫలదాయక అనుభవం పొందేందుకు మీ ఉదారమైన సమర్పణ భక్తులకు సహాయపడుతుంది.