మీరు శాంతిని అంతర్గతంగాను — మరియు సర్వత్రా ఎలా స్థాపించగలరు అనే అంశంపై పరమహంస యోగానంద

06 సెప్టెంబర్, 2022

పరమహంస-యోగానంద-చివరి-చిరునవ్వు

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి...

మీరు ప్రపంచాన్ని మీ మాతృభూమిలా ప్రేమిస్తానని మరియు మీ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తున్నట్లే మీ దేశాన్ని కూడా ప్రేమిస్తానని నిశ్చయించుకోండి. ఈ అవగాహన మీరు పొందడం ద్వారా నాశనం చేయలేని జ్ఞానపునాదులపై ఒక ప్రపంచ కుటుంబాన్ని స్థాపించడానికి మీరు సహాయపడతారు.

తమ దైనందిన ధ్యానమనే భక్తిపూర్వకమైన సాధనతో శాంతిని సృష్టించేవారే నిజమైన శాంతి సంధాతలవుతారు.

క్రమం తప్పకుండా ధ్యానము మరియు దైవానుసంధానాన్ని అభ్యసించండి, మరియు మీ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, సర్వవేళలా ఆనందం మరియు ఆహ్లాదకరమైన మదిరాన్ని మీరు రుచి చూస్తారు. మీ మౌన సాక్షాత్కారం యొక్క దేవతా కరముల నుండి అంతర్గత శాంతి అనే అమృతాన్ని పానంచేసి, మీ దైనందిన జీవితంలోని కలవరాలను, దుఃఖాలను అణచివేస్తారు.

మీ లోపల ఒకసారి ఆ శాంతిని మీరు కనుగొన్నప్పుడు, అది మీ పరిసరాలకు మరియు ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా బయటకు ప్రవహిస్తుంది. అంతర్గతంగా సామరస్యత, బాహ్యంగా సామరస్యత, సర్వత్రా సామరస్యత ఏర్పడుతుంది! దేవుని శాంతితో నిండిన వ్యక్తి అందరి పట్ల సద్భావనను తప్ప మరే భావనను కలిగి ఉండడు. ఆ చైతన్యం మాత్రమే ధరిత్రిపై శాశ్వత శాంతిని తీసుకురాగలదు.

 

“పరమహంస యోగానందగారి ‘భూమిపై శాంతి కొరకు ప్రార్థన’ అనే అంశంపై స్వామి భూమానంద గిరి నిర్వహించే నిర్దేశిత ధ్యానంలో పాల్గొనవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ధ్యానం, పరమహంస యోగానందగారి ప్రార్థనలోని శక్తివంతమైన ఆలోచనలను మానసికంగా చిత్రించుకోవడం మరియు మననం చేయడంతో కూడి ఉంటుంది. మీలో శాంతి నెలకొన్న తర్వాత, మీరు మీ శాంతి మరియు ప్రేమలను “ప్రపంచంలోని అందరి నాయకుల మరియు పౌరుల హృదయాలలోకి వ్యాపింపజేయటం” ద్వారా — ఈరోజైనా మరియు ఏ రోజైనా — ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలరు.

ఇతరులతో పంచుకోండి