“మీరు కోరుకున్న మార్పు మీలో వచ్చినట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోండి!” అనే అంశంపై లారెన్స్ మార్టిన్

జూన్ 9, 2023

యోగదా సత్సంగపత్రిక ఏప్రిల్-జూన్ 2004 సంచికలో వచ్చిన “రీ-ఇన్వెంటింగ్ యువర్ లైఫ్: ఎయిట్ సెల్ఫ్-ఛేంజ్ స్ట్రాటజీస్ దట్ వర్క్ (Reinventing Your Life: Eight Self-Change Strategies That Work)” అనే వ్యాసం నుండి ఈ క్రింది సారాంశాలు. లారెన్స్ మార్టిన్, దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన దీర్ఘకాల క్రియాబాన్ భక్తులు.

మీరు ఒక్కసారి ఆగి మీలో జరుగుతున్న అంతర్గత సంభాషణను గమనించడానికి ఇది సమయం. మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమి చెబుతున్నారు? మిమ్మల్ని మీరు అభినందించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొంటున్నారా?

ప్రతికూలమైన స్వీయ-సంభాషణ మనకు సందేహాలను, అస్థిరతను, ఆందోళనను మరియు అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. సానుకూలమైన స్వీయ-సంభాషణ దీర్ఘకాల భయాలు మరియు అడ్డంకులను అధిగమించడానికి, మరింత నమ్మకంగా ఉండడానికి, అలాగే ఆత్మవిశ్వాసంతో ఉండడానికి, అలాగే కనపడటానికి, చర్యలకు, మరియు ఎక్కువ నియంత్రణలో ఉండటానికి కావలసిన బలమైన కొత్త సందేశాలను అందిస్తుంది.

ఏ విధమైన స్వీయ-సంభాషణ చేస్తున్నారు అన్నదానిపై శ్రద్ధ చూపడం

మనస్తత్వవేత్త అయిన షాడ్ హెల్మ్‌స్టెటర్, పి. హెచ్‌.డి, వాట్ టు సే వెన్ యు టాక్ టు యువర్ సెల్ఫ్ (What to Say When You Talk to Your Self) అనే వ్యాసంలో, మనం మన అవచేతన మనస్సును రూపొందించుకొనే స్వీయ-సంభాషణ యొక్క వివిధ స్థాయిలను వివరించారు. మీరు మీ మనస్సుకు అందించే “నేను” వివరణలపై శ్రద్ధ వహించండని ఆయన సూచించారు:

— “నేను చేయలేను.” హెల్మ్‌స్టెటర్ దీనిని చెత్త రకం అని పిలుస్తారు మరియు దురదృష్టవశాత్తు, మనం మన మనస్సును పోషించే అత్యంత సాధారణ “కార్యక్రమాలలో” ఇది ఒకటి. ఈ పదబంధాన్ని మీరు ఉపయోగించడం పట్ల జాగ్రత వహించడమనేది ప్రతికూల, స్వీయ-పరిమితి నమ్మకాలను వేళ్ళతో పెకలించివేయటానికి మరియు వాటిని సానుకూల లక్ష్యాలతో భర్తీ చేయడానికి, ఆ సానుకూల లక్ష్యాలను మెరుగుపరచటానికి మీకు సహాయపడుతుంది.

— “నేను చేయాలి.” ఇది మంచిది, కానీ ఇంకా ఇది ప్రాథమికంగా ప్రతికూలంగానే ఉందని హెల్మ్‌స్టెటర్ చెప్పారు, ఎందుకంటే మీరు సమస్యను గుర్తించారు, కానీ పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు.

— “నేను చేయను.” లేదా “నేను ఎప్పుడూ చేయను.” ఈ స్థాయిలో, స్వీయ-సంభాషణ మీకు వ్యతిరేకంగా కాక మీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది అని హెల్మ్‌స్టెటర్ చెప్పారు. మారవలసిన అవసరాన్ని మీరు గుర్తించారు మరియు దాని గురించి ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మార్పు ఇప్పటికే జరిగినట్లుగా మీకు మీరే దానిని వ్యక్తీకరిస్తున్నారు, అవచేతన మనస్సును తిరిగి కార్యక్రమం చేయడానికి ఇది సహాయపడుతుంది.

స్వీయ-మార్పు కోసం మీ ఆదర్శాల మరియు లక్ష్యాల ఫలసిద్ధిని, ఇక్కడ మీరు మీ యొక్క క్రొత్త రూపాన్ని, దివ్యసంకల్పంతో అవచేతనకు ధృవీకరిస్తున్నారు — “నేను ఉన్నాను.” ఈ రకమైన స్వీయ-సంభాషణ “నేను చేయలేను” అనే దానికి వ్యతిరేకం; మిమ్మల్ని ప్రతికూల మానసిక మార్గాలలో ఉంచడానికి బదులు ఇది మీ అవచేతన మనస్సు యొక్క శక్తిని సమీకరించి, మీకు సహాయం చేస్తుంది.

ఇప్పుడే ప్రారంభించండి, ఇప్పుడే ప్రయత్నించండి — మరియు మీ జీవితాన్ని మార్చుకోండి

వెంటనే మీ స్వీయ-సంభాషణపై పనిచేయడం ప్రారంభించండి. మీకు మీరిచ్చే తదుపరి ప్రతికూల వ్యాఖ్యను గమనించండి; ఆ వ్యాఖ్యను సానుకూలంగా మార్చడానికి ప్రయత్నించండి. మరియు మీ విశ్రాంతి సమయంలో మానసిక ఊహాచిత్రణ మరియు దివ్యసంకల్పం ను సాధన చేయండి — మీరు కోరుకునే మార్పు జరిగినట్లుగాను మరియు ఆ మార్పులో మిమ్మల్ని మీరు చూసుకొని, వర్ణించుకోండి. చివరికి మీరు ప్రతికూల స్వీయ-సంభాషణను మధ్యలోనే ఆపగలుగుతారు.

ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, పరమహంస యోగానందగారిచే స్థాపించబడిన యోగదా సత్సంగ సంస్థ, యోగా యొక్క సనాతనమైన సార్వత్రిక సత్యాలను కోరుకొనే ఉన్నత చైతన్యము కలవారికి ఆత్మను పరమాత్మతో ఏకం చేసే భారతదేశపు పురాతన శాస్త్రాన్ని మరియు సామరస్యమైన, శ్రేయస్కరమైన జీవితాన్ని గడిపే మార్గాన్ని పరిచయం చేస్తోంది. ప్రస్తుతం యోగదా సత్సంగ పత్రిక వార్షికంగా ముద్రించబడుతోంది. చందాను ఎంపిక చేసుకొనే అవకాశంగల ఈ పత్రికలో, పరమహంసగారి పూర్వకాలపు వ్యాసాలు, గత మరియు ప్రస్తుత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఇతర ప్రియమైన ఎస్.ఆర్.ఎఫ్ మరియు వై.ఎస్.ఎస్. రచయితల వ్యాసాలు విస్తృతపరచబడిన ఆన్‌లైన్ లైబ్రరీలో లభ్యమయ్యే అవకాశాన్ని కలిగిస్తోంది.

ఇతరులతో పంచుకోండి