వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో గురుపూర్ణిమ వేడుకలు ఒక సామూహిక ధ్యానంతో ప్రారంభమయ్యాయి, తరువాత ఒక స్ఫూర్తిదాయక సత్సంగాన్ని స్వామి శ్రద్ధానంద నిర్వహించారు.
ధ్యానం తరువాత గురుపూజ నిర్వహించడం జరిగింది.
బ్రహ్మచారులు శాంభవానంద మరియు ప్రహ్లాదానంద నిర్వహిస్తున్న భజన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులు.
ఈ కార్యక్రమం తరువాత ఒక ప్రత్యేక భండారా నిర్వహించబడింది, ఇందులో 2000 మంది భక్తులకు ప్రసాదం అందించబడింది.
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, ద్వారహాట్ వద్ద ఒక ప్రత్యేక ధ్యానానికి ముందు హారతి ఇస్తున్న స్వామి ధైర్యానంద.
ధ్యానం తరువాత ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు.
వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం నిర్వహించే పాఠశాల — బాలకృష్ణాలయ — లో గురుపూర్ణిమ సందర్భంగా బాలలు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామి వాసుదేవానంద.
ద్వారహాట్ ఆశ్రమంలో పాఠశాల బాలలచే ఒక ప్రదర్శన.
గురుపూర్ణిమ సందర్భంగా యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం నోయిడా వద్ద అలంకరణ.
వేడుకలలో భాగంగా, నారాయణ సేవలో పాల్గొంటున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు స్వచ్ఛంద సేవకులు, అక్కడ 1400 మంది భక్తులకు ప్రసాదం అందించబడింది.
ఈ ప్రత్యేక రోజున, ఆశ్రమ ప్రాంగణంలోని తొలి సంధ్య ఊరేగింపులో గురుదేవుల నామాన్ని ఆలపిస్తున్న భక్తులు.
ఆ తరువాత ఒక స్ఫూర్తిదాయక సత్సంగాన్ని స్వామి స్మరణానంద నిర్వహించారు.
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, దక్షిణేశ్వరంలో ఒక స్ఫూర్తిదాయక సత్సంగంలో ప్రసంగిస్తున్న స్వామి అచ్యుతానంద.
దక్షిణేశ్వరంలో భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తున్న స్వామి కేదారానంద.
పశ్చిమ బెంగాల్ లోని వై.ఎస్.ఎస్. శ్రీరాంపూర్ కేంద్రంలో గురుపూర్ణిమ సందర్భంగా ఒక ప్రత్యేక ధ్యానం నిర్వహించబడింది.
వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యానవాసం వద్ద జరిగిన గురుపూర్ణిమ వేడుకల్లో యోగదా బోధనల గురించి సంభాషిస్తున్న స్వామి సుద్ధానంద.
కర్ణాటకలోని ఆర్సీకెరేతో పాటు భారతదేశంలోని వై.ఎస్.ఎస్. కేంద్రాలన్నిటిలో గురుపూర్ణిమ వేడుకగా నిర్వహించబడింది.