భగవాన్ కృష్ణుడిని భారతదేశంలో అవతార పురుషుడుగా (భగవంతుని అవతారంగా) భావిస్తారు, పూజిస్తారు. శ్రీకృష్ణుని ఉదాత్త బోధనలు భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎంతగానో ప్రశంసలు పొందిన తన రెండు సంపుటాల భగవద్గీత వ్యాఖ్యానములో పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:
“అది ఉపనిషత్తుల సారము, భారతదేశంలో అత్యంత ఆదరణీయ గ్రంథము, హిందువులకు బైబిల్ వంటిది, గొప్ప పవిత్ర గ్రంథము, ఆధ్యాత్మిక సర్వోత్తమ ప్రమాణాలకు మూల గ్రంథముగా జగద్గురువులందరు భావించిన గ్రంథము….
“విస్తారమయిన ఆధ్యాత్మిక మార్గదర్శిగా భగవద్గీత, నాలుగు వేదాలకు, 108 ఉపనిషత్తులకు మరియు హిందువుల ఆరు శాస్త్రాలకు సారాంశముగా కొనియాడబడుతోంది…విశ్వంలోని జ్ఞానమంతా గీతలో నిక్షిప్తమై ఉంది. అత్యంత గాఢమైనది అయినప్పటికీ, స్వాంతననిచ్చే సరళతతో కూడిన అందమైన ద్యోతక భాషలో ఉండి మానవ ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక పోరాటాల యొక్క అన్ని స్థాయిలలోనూ అన్వయించబడి వినియోగించబడింది – భిన్నమైన స్వభావాలు మరియు అవసరాలతో ఉండే మానవుల యొక్క విస్తారమైన
వర్ణమాలకు ఆశ్రయం కల్పిస్తుంది. భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళే మార్గంలో ఎక్కడున్నవారికైనా, మార్గంలోని తదనుగుణ అంశానికి గీత వెలుగు ప్రసరింపచేస్తుంది. . . .
“తూర్పు దేశాలలో యోగమునకు కృష్ణుడు దివ్య దృష్టాంతముగా నిలుస్తాడు; పశ్చిమ దేశాలలో దివ్యానుసంధానానికి దృష్టాంతముగా క్రీస్తు, భగవంతుడిచే ఎన్నుకోబడ్డాడు. కృష్ణుడు అర్జునుడికి బోధించిన క్రియాయోగ ప్రక్రియ, గీత అధ్యాయములు IV:29, V:27-28 శ్లోకాలలో సూచించబడినది. ఇదే ధ్యాన యోగం యొక్క అత్యున్నతమైన ఆధ్యాత్మిక శాస్త్రం. భౌతిక యుగాలలో మరుగుపరచబడిన, ఈ నాశరహిత శాస్త్రం ఆధునిక మానవుల కొరకు మహావతార్ బాబాజీ ద్వారా పునరుద్ధరించబడింది మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురువులచే బోధించబడుతోంది.”