“దీన్ని ప్రారంభించండి!” శ్రద్ధామాత ద్వారా

10 జనవరి, 2023

శ్రద్ధామాత (1895–1984) శ్రీ పరమహంస యోగానందను 1933లో కలుసుకున్నారు, మరియు కొద్ది కాలానికే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాస వ్యవస్థలో చేరారు. తరువాత పరమహంస యోగానందగారిచే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ డైరెక్టర్ల బోర్డులో నియమించబడ్డారు, ఆమె జీవితాంతం ఆ హోదాలో తన సేవలందించారు. ఆమె ఈ వ్యాసాన్ని మొదటిసారి 1935లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పత్రిక కోసం వ్రాశారు, కానీ దాని సందేశం ఎల్లప్పుడూ సందర్భోచితంగా ఉంటుంది — ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభంలో లేదా విలువైనదాన్ని మీరు స్వీకరిద్దామనుకొన్నప్పుడు, ప్రస్తుత క్షణం మీకు ఆ అవకాశాన్ని కలుగజేస్తోంది.

మీకు రహస్య ఆశయం ఉందా? మీరు ఈ రోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభించడాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం మీకు అందించబడితే, మీరు ఏం చేస్తారు?

అలా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని జీవితం మీకు కలుగజేస్తోంది. మీరు కోరుకున్నట్లుగా మలుచుకునేందుకు సమయమనే మెత్తని మట్టి మీ చేతుల్లోనే ఉంది. తరచుగా అసాధ్యంగా కనిపించిన కార్యసాధన ఎంతో న్యాయమైనది. మీరు చేయలేరని మీరు అనుకున్నది అదే — దీన్ని ప్రారంభించండి!

మిమ్మల్ని పరిమితులుగా చేసే ఆలోచన-అలవాట్లనే స్వీయ-సంకెళ్లను పారద్రోలండి. అంతర్గత గుసగుసలను ఆలకించండి. గాఢంగా అంతర్ముఖుడైన వానికి సంతోషకరమైన సంభ్రమాశ్చర్యాలను అతని జీవితం కలిగిస్తుంది.

ఒక్క రోజులో ఏ లక్ష్యం సాధించబడదు. ఆవశ్యకమైన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇప్పుడే ప్రారంభించండి— రేపు కాదు. ప్రారంభించండి! అవకాశం యొక్క ఈ అద్భుత క్షణమే గుప్త నిధి అన్వేషణకు కీలకం.

మీ మేధస్సు యొక్క తటాకాన్ని తట్టండి, దీని మూలం అనంతంలో ఉన్నది. ఎంత చిన్నదైనప్పటికీ మొదటి అడుగు వేయండి. మీ శక్తి విడుదలవుతుంది, ఆ శక్తి మంచు ముద్దలాగా దానికదే ఎక్కువ సేకరిస్తుంది.

“సమర్థతే చివరి స్థాయి వరకు బాధ్యత తీసుకుంటుంది.” మీ గుప్త ప్రతిభ మీ నిర్వహణకు అప్పగించబడిన ఫలవంతమైన విత్తనం. వాయిదా వేసే శుష్క నేలలో దానిని ఎండిపోనిచ్చే హక్కు మీకు ఉందా? మీలో పాదుకొల్పబడినదాని నుండి మీరు నమ్మకంగా ఫలితాన్ని పొందమని మాత్రమే జీవితం అడుగుతుంది.

కార్య సాధనకు అవసరమైన అన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి. మీ జాగృతమైన అవగాహనతో వాటిని గుర్తించండి.

ఉద్రేకంతో, కోరికతో కూడిన ప్రయత్నంతో కాకుండా సులభంగా మరియు ఆనందంగా పని చేయండి. ప్రయత్నం కంటే ఎక్కువగా లక్ష్యాన్ని ప్రేమించకండి. అప్రమత్తమైన మనస్సు మరియు ప్రేమ హస్తాలతో, నిత్యత్వ ఆకృతిలోకి ప్రస్తుతమనే కాంతివంతమైన దారాలను అల్లండి.

మరియు మీ అందమైన ఆశాజనక పాత్ర అజాగ్రత్తతో చేసిన స్పర్శ వలన లేదా మూర్ఖపు పవనాలతో చెదిరిపోతే, దుఃఖించకండి. అర్థం చేసుకోవడం ద్వారా హృదయాన్ని బలోపేతం చేసుకొని, మరింత సున్నితమైన కార్యసిద్ధితో మరియు మరింత నిజమైన దృష్టితో, మళ్లీ ప్రారంభించండి! ప్రారంభించడం మాత్రమే! అందులోనే మేధా శక్తి దాగి ఉంది.

“మీరు ఎలా అవుతారో అది ఇంకా కనిపించలేదు” (I యోహాను 3:2). విత్తనం యొక్క హృదయంలో వికాసం నిద్రిస్తుంది. కానీ విత్తనానికి దాని స్వంత ప్రారంభం లేదా దాని స్వంత ముగింపు తెలుసా? వెచ్చదనం మరియు తేమతో కూడిన దానిని సేకరిస్తూ, దాని స్వంత జీవం యొక్క వికసిస్తున్న హృదయం సూర్యుడిని పలకరించడానికి ఆనందంతో విస్తరిస్తూ పోతుంది.

కార్యాచరణ చేయమని జీవితం మిమ్మల్ని బుజ్జగిస్తోంది, వేడుకుంటోంది, ఆదేశిస్తోంది. ఈ రోజే, మీ లోపల దాగి ఉన్న దాని అభ్యర్థనను గుర్తించండి. మీ పరిమితుల కవచాన్ని విచ్ఛిన్నం చేయండి. పునరుత్థానం చెందిన ఓ మానవ కుమారుడా! నీ ముఖాన్ని కాంతి వైపు తిప్పి కార్య శూరుడవు కమ్ము.

ఇతరులతో పంచుకోండి