ధన్యవాదాలర్పించడం (Thanksgiving) మరియు కృతజ్ఞతా భావాన్ని అభ్యాసించడం గురించి పరమహంస యోగానంద

22 నవంబర్, 2023

పరమహంస-యోగానంద-3326

దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతించడం వల్ల, ఆధ్యాత్మికాభివృద్ధి, సమృద్ధి ప్రవేశించడానికి మీ చైతన్యంలో మార్గం ఏర్పడుతుంది. అలాంటి మార్గం ఏర్పడగానే పరమాత్మ గోచర రూపము ఆ మార్గం గుండా మీ లోనికి ప్రవేశిస్తుంది. మీరు సర్వదా సమస్తానికీ కృతజ్ఞతతో ఉండాలి. ఆలోచించడానికి, మాట్లాడడానికి, పనిచేయడానికి శక్తి భగవంతుని నుండే వస్తున్నదని, ఆయన ఇప్పుడు మీలోనే ఉండి ప్రేరణనిచ్చి నడిపిస్తున్నాడని గుర్తుంచుకోండి.

మీ కళ్ళు తెరిచి ఇప్పుడు మీకున్న మంచితనాన్ని చూడండి, ఆ తరువాత మీకొచ్చే ప్రతి కొత్త అభివ్యక్తిని గుర్తించడానికి అప్రమత్తంగా మరియు జాగరూకతతో ఉండండి. పరమపితతో భక్తితో సంభాషించండి మరియు జీవితంలోని మంచి విషయాలన్నిటికీ ఆయనకు కృతజ్ఞతలు తెలపండి. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడు, మరియు మీలో ఉన్న దైవశక్తిని మీరు గుర్తించగలిగితే మీ విజయానికి ఏదీ ఆటంకం కలిగించలేదు.

సర్వసంపన్నుడైన ఆయనకు, ఎంత హృదయపూర్వకమైనవైనా మన కృతజ్ఞతలు అవసరం లేదు; కాని మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉన్నప్పుడు, మనకు ఆ సర్వోత్పత్తి కేంద్రమైన భగవంతునిపైనే, మనకు అమితమైన మేలు చేకూరుట కోసం మన దృష్టి కేంద్రీకరింపబడుతుంది.

క్యాలెండర్ లో కృతజ్ఞతలర్పించే (Thanksgiving) తేదీని సూచించినప్పుడు మాత్రమే కాకుండా, మీరు పొందుతున్న అనేక ఆశీస్సులకు ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉండండి. భౌతిక శ్రేయస్సు మాత్రమే మీ కృతజ్ఞతలకు ప్రాతిపదిక కాకూడదు. ప్రాపంచిక ఆస్తులు మీకు ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా, దేవుని నుండి పొందిన బహుమతులతో మీరు ధనవంతులే. మీకు భౌతికమైన వస్తువులను ఇవ్వబోతున్నందుకే కాదు, పరమపితగా తనను తాను బహుమతిగా మీకు ఇవ్వబోతున్నందుకు ఆయన్ని ప్రేమించండి.

నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. అది ఆయన అనుగ్రహంతో అధిగమించబడుతుంది. ఈ జీవితంలో నేను కోరుకున్నవాటన్నిటినీ ఆయన నాకు ప్రసాదించాడు; కాని, అన్నిటికంటే ఎక్కువగా, ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన పట్ల నాకు ఎంతో కృతజ్ఞత కలుగుతోంది! నా హృదయంలో దాగుడుమూతలాడినవాడు — ఆయన ఇప్పుడు ఎప్పటికీ దగ్గరగా ఉన్నాడు. సమస్త వాస్తవ వ్యక్తీకరణల యొక్క నిర్లక్ష్యం వెనుక ఆయన దాగి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీ కోసం అక్కడ వేచి ఉన్నాడు. మీరు బాధలతో ప్రయాస పడనవసరం లేదు. ఆయన దగ్గరకు పరుగెత్తండి. అత్యంత ప్రియతముడు నిరీక్షిస్తున్నాడు; మిమ్మల్ని స్వీకరించడానికి, మిమ్మల్ని ఆధ్యాత్మీకరించడానికి మరియు మిమ్మల్ని అమరులుగా చేయడానికి ఆయన చేతులు చాపి ఉన్నాయి.

ఇతరులతో పంచుకోండి