క్రిస్మస్ యొక్క నిజమైన వేడుక గురించి పరమహంస యోగానందగారు

12 డిసెంబర్, 2023

Paramahansa-Yogananda

ప్రతి సంవత్సరం క్రిస్మస్ తరుణంలో, క్రీస్తుప్రేమ మరియు ఆనందం యొక్క ప్రకంపనలు మామూలుగా కంటే శక్తివంతంగా దివ్యలోకాల నుండి భూమికి ప్రసరిస్తాయి. ఏసు జన్మించినప్పుడు భూమిపై ప్రకాశించిన అనంతమైన కాంతితో ఆకాశం నిండిపోయింది. భక్తి మరియు గాఢమైన ధ్యానం ద్వారా క్రీస్తుతో అనుసంధానంలో ఉన్న వ్యక్తులు, సర్వవ్యాప్త చైతన్యం యొక్క పరివర్తనకారక ప్రకంపనలను అద్భుతమైనరీతిలో ప్రత్యక్షంగా అనుభవిస్తారు.

రోజంతా క్రిస్మస్ ధ్యానం అనే ఆలోచన నిజంగా క్రీస్తు ద్వారా నాకు ఇవ్వబడింది, ఆయన మీకోసం ఏమైనా చేయగలడు. ఆయన మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. కాని మీకు గ్రహణశీలత లేకపోతే ఆయన చేతులు కట్టివేయబడతాయి. ఆయన మీ వద్దకు రావాలనుకుంటున్నాడు, కాని మీ జీవితంలోకి ఆయన ప్రవేశించగలిగిన ఏకైక మార్గమైన మీ భక్తి ద్వారాలు మూసివేయబడితే ఆయన ప్రవేశించలేడు. చిత్తశుద్ధి గల ఆత్మలను ఆయన ఎక్కడ కనుగొన్నా, ఆయన వారి వద్దకు రావడానికి ప్రయత్నిస్తాడు; కాని ప్రశాంతత యొక్క తలుపులు మూసివేయబడినప్పుడు మరియు అశాంతి యొక్క గొళ్ళెం ఆత్మను బంధించినప్పుడు ఆయన మీలోకి ఎలా ప్రవేశించగలడు? అయినప్పటికీ, మీరు దీర్ఘంగా మరియు గాఢంగా ధ్యానం చేసి, మీ ఆత్మ యొక్క పరిపూర్ణమైన ప్రేమతో క్రీస్తుని పిలిచి, అశాంతి మరియు సందేహాల యొక్క అన్ని అడ్డంకులను తొలగించినప్పుడు, ఆయన మనఃపూర్వకంగా ప్రవేశించడాన్ని మీరు కనుగొంటారు. అప్పుడే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం మరియు ఆనందం మీరు గ్రహిస్తారు.

మీలోనే ఉన్న ఆయన విశ్వవ్యాప్త ప్రేమ, క్షమ, వ్యక్తిత్వం, పరిత్యాగం మరియు భక్తిని పొందడం ద్వారా మరియు అన్ని సోదర జాతులపై, సర్వ జీవులపై క్రీస్తు-ప్రేమను అనుభవించడం ద్వారా: ఏసు జన్మదినాన్ని నిజమైన వేడుకగా జరుపుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

మీ సాంఘిక ఉత్సవాలకు క్రీస్తును — మీ ధ్యాన చైతన్యం ద్వారా — రెండవసారి తీసుకురావడాన్ని జోడించండి. క్రిస్మస్ పండుగలలో క్రీస్తు యొక్క ఒక సూచన మాత్రమే ఉంది; కాని ధ్యానంలోని దివ్య పారవశ్యం యొక్క ఊయలలో శాశ్వతమైన, నిత్యానందకర సత్యంగా ఆయన దర్శనమిస్తాడు మరియు అనుభవంలోకి వస్తాడు.

అనంత క్రీస్తు మీద నిర్దేశిత ధ్యానం మరియు పరమహంస యోగానందగారి మరిన్ని రచనల కోసం దయచేసి మా “పర్వదిన స్ఫూర్తి” పేజీని సందర్శించండి. ఈ తరుణం యొక్క గాఢమైన మహత్త్వాన్ని అనుభవించేందుకు ప్రతి ఒక్కరికీ అది సహాయపడుతుంది.

ఇతరులతో పంచుకోండి