“సత్యాన్ని స్పృశించడం: భక్తియుత దివ్యసంకల్పాల పరివర్తనకారక శక్తి” — స్వామి చిదానంద గిరి గారితో ఒక నిర్దేశిత ధ్యానం (ఇంగ్లీషులో వీడియో)

9 ఫిబ్రవరి, 2024

మనస్సు మరియు శరీరాన్ని నయం చేయడంలో దివ్యసంకల్పాల శక్తిని జనబాహుల్యం కనుగొనే దశాబ్దాలకు ముందే, ప్రతి మానవుడిలో దాగి ఉన్న గొప్ప స్వస్థతా శక్తులను నేరుగా పొందటము మరియు ఉపయోగించడము గురించి, పరమహంస యోగానందగారు యునైటెడ్ స్టేట్స్ లోని శ్రద్ధాళువులైన ప్రేక్షకులకు బోధించారు.

1924లో శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు అనే తమ పుస్తకంలో ప్రచురించిన పరివర్తనకారక దివ్యసంకల్పాలను మొట్టమొదటిసారిగా పరమహంసగారు రూపొందించి వంద సంవత్సరాలు అయ్యింది.

పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథకు మరియు వారి ఇతర రచనలకు, 1971లో తాను గతించే వరకు సంపాదకురాలిగా పని చేసిన ఆయన అత్యున్నత క్రియాయోగ శిష్యురాలయిన తారామాత తెలిపిన ఆ కార్యాచరణకు సంబంధించిన మూలాలపై ఒక కథనాన్ని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఈ వీడియోలో పంచుకున్నారు. పరమహంసగారి దివ్యసంకల్పాలను మన జీవితాల్లో వివిధ రూపాల్లో చేర్చుకోవడం వల్ల కలిగే శక్తివంతమైన ప్రభావాన్ని గురించి స్వామి చిదానందగారు వివరించారు, ఆ తరువాత ఆ ప్రభావాన్ని అనుభవించేందుకు ఒక నిర్దేశిత ధ్యానాన్ని ఆయన నిర్వహించారు.

Play Video

స్వామి చిదానందగారి ఉపన్యాసం యొక్క సందర్భం, బే ఏరియాలోని ఎస్.ఆర్.ఎఫ్. ఆలయం యొక్క సమర్పణ వేడుక అయినప్పటికీ, భక్తి గీతాలు, దివ్యసంకల్పాలు మరియు ప్రార్థనలపై ఆయన స్ఫూర్తిదాయకమైన పరిజ్ఞానాన్ని మనమందరం ఆచరించేందుకు ఉపయోగించకోవచ్చు; మరియు వాటి ద్వారా ఉన్నత ప్రయోజనం వెంటనే అనుభవించేందుకు నియమిత సమయంపాటు ఆయన నిర్వహించిన నిర్దేశిత ధ్యానం మనకు సహాయపడుతుంది.

మే 20, 2023న జరిగిన ఎస్.ఆర్.ఎఫ్. బే ఏరియా ఆలయం యొక్క సమర్పణ వేడుక యొక్క పూర్తి వీడియో ఎస్.ఆర్.ఎఫ్. బ్లాగ్ లో వీక్షించవచ్చు.

ఈ వీడియోలో స్వామి చిదానందగారు పరమహంస యోగానందగారు చేసిన మూడు రచనలను గురించి ఉదహరించారు, ఆ రచనలు ఆధ్యాత్మీకరించబడిన దివ్యసంకల్పాలను, ప్రార్థనలను మరియు కీర్తనలను అందిస్తాయి. దైవంతో పరమహంసగారు గాఢమైన అనుసంధానములో ఉన్నపుడు పొందిన అదే అనుభవాన్ని మీలో మేల్కొల్పడానికి మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ఈ మూడు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి:

ఇతరులతో పంచుకోండి