భగవంతుడిని అన్వేషించాలంటే ఏమీ ఆశించవద్దు. అంతర్గతంగా ఉన్న ఆయన ఆనందకరమైన సాన్నిథ్యంలోకి విశ్వాసంతో ప్రవేశించండి.
— స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి
తమ గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గురించి పరమహంస యోగానందగారు ఇలా వర్ణించారు: “దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన; నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం.”
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవాన్ని (మే 10) పురస్కరించుకొని వారి గౌరవార్థం ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఆన్లైన్ దీర్ఘ ధ్యానాన్ని నిర్వహించారు.
ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూర్చే ఈ కార్యక్రమం నిర్ణీత సమయంపాటు కీర్తన గానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానంతో కూడి నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.
మీరు వీటిని కూడా అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
ఈ ప్రత్యేక సందర్భంలో – స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ఆవిర్భావ దినోత్సవం – భక్తులు తాము పొందిన ఎన్నో ఆశీస్సులకు కృతజ్ఞతగా గురు-ప్రణామి సమర్పించడం ఒక సంప్రదాయంగా ఉంది. మీ విలువైన విరాళం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల ఆత్మ-విముక్తి బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.
విరాళం సమర్పించాలని మీరు భావిస్తే, క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో విరాళాన్ని సమర్పించవచ్చు.