“ఓ గురుదేవా, మీరు నన్ను దిగ్భ్రాంతికరమైన ప్రదేశం నుండి శాంతియుత స్వర్గంలోకి లేవనేత్తారు. నా విచారకరమైన గాఢనిద్ర ముగిసింది, ఇప్పుడు నేను ఆనందంలో మేల్కొన్నాను.”~ పరమహంస యోగానంద
ప్రియతములారా,
హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ప్రణామాలు. నేను మీకు సంతోషకరమైన మరియు పావనమైన గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర దినమున, భారతదేశంలోని లక్షలాదిమందితోను మరియు ప్రపంచమంతటా ఉన్నవారందరితోను కలిసి, యుగయుగాలుగా మానవాళిలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ఆ దివ్యగురువులను గౌరవించుకొనేందుకు కలుద్దాం. మన వ్యవస్థాపకులు పరమహంస యోగానందగారు అటువంటివారే. ఒక సద్గురువు, భగవంతుని ఆశీస్సులకు మరియు మార్గదర్శకత్వానికి ఒక సర్వోన్నత ద్వారము, ఆయన మార్గంలో తారసపడిన వారందరి జీవితాలను ఆయన స్పృశించారు. ఆయన బోధనలు, ఆదర్శాలకు అనుగుణంగా జీవించేవారందరు, ఈ రోజున కూడా ఆయన ప్రత్యేక కృపకు పాత్రులవుతారు.
ఈ పవిత్ర సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. శాంతి, ప్రేమ మరియు నిరంతరం విస్తరిస్తున్న దివ్యానందం గల “గురువుల దినోత్సవం” గా ఇది ప్రతిరోజు మీకు ఉండుగాక.
భగవంతుడు మిమ్మల్ని దీవించుగాక,
స్వామి చిదానంద గిరి



















