నూతన సంవత్సరాన్ని, మీరు నాటడానికి బాధ్యత వహించే తోటగా చిత్రీకరించుకోండి. మంచి అలవాట్లనే విత్తనాలను ఈ భూమిలో నాటండి, గతానికి సంబంధించిన చింతలు మరియు తప్పుడు చర్యలనే కలుపు మొక్కలను తొలగించండి.
— పరమహంస యోగానంద
పరమహంస యోగానందగారి సూచనల ప్రకారం, రాబోయే సంవత్సరంలో మీరేం చేయాలనుకుంటున్నారో మరియు మీరేం కాదలచుకున్నారో నిర్దేశించుకొని, మీ కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి నూతన సంవత్సరమే సరైన సమయం. రాబోయే సంవత్సరంలో మన విలువైన లక్ష్యాలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించేలా, ధ్యానంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించే సంప్రదాయాన్ని ఆయన నెలకొల్పారు.
డిసెంబర్ 31, ఆదివారం రాత్రి 11:30 గంటల నుండి జనవరి 1, సోమవారం ఉదయం 12:15 గంటల వరకు (భారత కాలమానం) నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.
డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా వ్యక్తిగతంగా పాల్గొనే ధ్యాన కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు మాకు చెందిన కొన్ని కేంద్రాలలో కూడా నిర్వహించడం జరిగింది.
మీరు వీటిని కూడా అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
ఈ నూతన సంవత్సరం సందర్భంగా, పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు పరోపకార కార్యక్రమాలకు సహకారం అందించడానికి మీకు స్వాగతం. దయచేసి విరాళం సమర్పించడానికి ఈ క్రింద లింక్‌కి వెళ్ళండి: