ప్రతిజ్ఞల యొక్క సిద్ధాంతము మరియు సూచనలు
ఓ సర్వవ్యాపక రక్షకుడా….జీవితంలో మరియు మరణంలో, రోగములో, క్షామములో, పీడలలో లేదా పేదరికంలో నేను ఎల్లప్పుడూ నిన్నే పట్టుకొని ఉండెదను గాక. బాల్యము, యవ్వనము, వయస్సు మరియు ప్రపంచ ఉపద్రవాల వలన కలిగే ఏ మార్పులు తాకకుండా, నేను మరణంలేని ఆత్మనని గ్రహించేలా నాకు సహాయం చెయ్యి.
ఓ తండ్రీ, నీ అపరిమిత స్వస్థతా శక్తి అంతా నాలో ఉంది. నా అజ్ఞానాంధకారములో నీ కాంతిని ప్రకాశింపచేయి. ఎక్కడైతే స్వస్థతా కాంతి ఉంటుందో, అక్కడ పరిపూర్ణత ఉంటుంది. కాబట్టి పరిపూర్ణత నాలో ఉంది.
నా ఆత్మలో ఇప్పటికే ఉన్న మొత్తం జ్ఞానము మరియు శక్తిని సహజావబోధం ద్వారా గ్రహించడం వల్ల, నా దివ్య జన్మహక్కుని నాకు ఇవ్వమని అడుగుతున్నాను.
ప్రియ దైవమా, ఆనందంలో మరియు దుఃఖములో, జీవితంలో మరియు మరణంలో నీ కనపడని రక్షణ కవచం నా చుట్టూ ఉందని నేను గ్రహించెదను గాక.
దేవుడు నాలో ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి దారి చూపే వెలుగును మూసివేసే భయాన్ని, నేను పారద్రోలుతాను.
దేవుని శక్తి అపరిమితమైనదని నాకు తెలుసు, మరియు ఆయన రూపంలోనే నేను తయారుచెయబడ్డాను. కాబట్టి అడ్డంకులన్నీ అధిగమించే శక్తి నాకు కూడా ఉంది.
నేను పరమాత్మ యొక్క సృష్టించే శక్తిని కలిగి ఉన్నాను. అనంతమైన మేధస్సు నా ప్రతి సమస్యకు దారి చూపించి పరిష్కరిస్తుంది.
నేను సేదతీరి, నా మానసిక భారములను పారద్రోలి దేవుని పరిపూర్ణమైన ప్రేమ, శాంతి మరియు జ్ఞానము నా ద్వారా వ్యక్తీకరించడానికి అంగీకరిస్తాను.