ఎవరైతే నన్ను అన్నిటియందు, అన్నిటినీ నాయందు దర్శిస్తాడో, అతడు నన్నెప్పుడూ మరువడు, నేనూ అతనిని మరవను.
— గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (VI:30)
ఈ సంవత్సరం ఆగస్ట్ 26న జన్మాష్టమిని — భగవాన్ శ్రీకృష్ణుని జన్మదిన వార్షికోత్సవాన్ని, ప్రపంచవ్యాప్తంగా భక్తులు వేడుకగా జరుపుకోగా, దివ్యప్రేమ యొక్క ఈ దివ్య అవతారమును గౌరవించుకొనేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. నియమిత సమయంపాటు పఠనం, భక్తి గీతాలాపన మరియు ధ్యానంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
శ్రీకృష్ణుని జ్ఞానం మరియు ధ్యాన బోధనలను అనుసరించేందుకు ఈ స్మారకోత్సవ ధ్యానం ఒక చక్కటి అవకాశాన్ని మనకు కలుగజేసింది, ఆయన యోగేశ్వరుడు లేక “యోగ ప్రభువు” గా కూడా గౌరవించబడతారు. ఆయన బోధనలన్నీ భగవద్గీతలో పొందుపరచబడ్డాయి.
ఈ సందర్భంగా, అన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.
పరమహంస యోగానందగారి ఆశ్రమాలు అందిస్తున్న జన్మాష్టమి 2024 సందేశం
జన్మాష్టమి సందర్భంగా, పరమహంస యోగానందగారి ఆశ్రమాలు అందిస్తున్న ఒక సందేశం చదవడానికి, దయచేసి ఈ లింక్‌ని సందర్శించండి:
వీటిని కూడా అన్వేషించడానికి మీరు ఇష్టపడవచ్చు:
భగవద్గీతలో భగవాన్ కృష్ణుని అమర సందేశానికి ప్రతీకగా ఆయన పట్ల మీకు ఉన్న భక్తి మరియు కృతజ్ఞతకు గుర్తుగా ఈ సందర్భంలో మీరు ఏమైనా సమర్పించాలనుకుంటే, దయచేసి క్రింద ఉన్న లింక్‌ను సందర్శించండి.