స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం

పరమహంస యోగానంద మరియు స్వామి శ్రీయుక్తేశ్వరుల గౌరవార్థం

శనివారం, మార్చి 2, 2024

ఉదయం 7:40 నుండి

– మధ్యాహ్నం 2:00 వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

నేను గతించిన తరువాత, నా బోధనలే మీకు గురువు…. ఈ బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ అనుసంధానంలో ఉంటారు.

— పరమహంస యోగానంద

మార్చి 2, శనివారంనాడు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మరియు మన గురుదేవులు పరమహంస యోగానందగారి మహాసమాధి — శరీరం నుండి దైవ-సాక్షాత్కారం పొందిన యోగుల అంతిమ సచేతన నిష్క్రమణ — ప్రత్యేక దినాలను స్మరించుకోవడానికి వారి గౌరవార్థం ఒక ఆరు-గంటల ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఈ స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం శక్తిపూరణ వ్యాయామాలతో ప్రారంభమయ్యింది, తరువాత స్ఫూర్తిదాయక పఠనాలు, మరియు నియమిత సమయంపాటు కీర్తన గానం మరియు ధ్యానం జరిగింది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ఒక ముగింపు ప్రార్థనతో ఇది ముగిసింది.

శనివారం, మార్చి 2న జరిగిన ధ్యానం, క్రింది ప్రణాళిక ప్రకారం నిర్వహించారు:

  • శక్తిపూరణ వ్యాయామాలు – ఉదయం 7:40 నుండి ఉదయం 8:00 వరకు
  • మొదటి భాగం – ఉదయం 8:00 నుండి 11:00 వరకు
  • రెండవ భాగం – ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి