ఇటీవల జరిగిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాస దీక్షా ప్రమాణాలు — ఒక ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించడం

9 మే, 2024

జూలై 1915లో, పరమహంస యోగానందగారు భారతదేశంలోని శ్రీరాంపూర్‌లో తన గురువుగారైన స్వామి శ్రీయుక్తేశ్వర్ నుండి సన్యాస దీక్షా ప్రమాణాలను (ప్రపంచాన్ని త్యజించడం) స్వీకరించినప్పుడు, ప్రాచీన భారతదేశపు ‘స్వామి’ సన్యాస పరంపరలో ప్రవేశించడం జరిగింది. ఆ సమయంలో ముకుంద లాల్ ఘోష్ — స్వామి యోగానంద గిరిగా మారారు — ఈ సంఘటన కేవలం ఇరవై రెండేళ్ల ఆయన జీవితంలో జరిగిన ఒక మలుపు మాత్రమే కాదు, 20వ శతాబ్దంలోను మరియు ఆ తరువాత జాగృతమవుతున్న ప్రపంచ ఆధ్యాత్మికతపై తన ప్రభావాన్ని ముందే సూచించారు, అంతేకాని శాశ్వత వారసత్వంలో భాగంగా ఆయన స్థాపించిన సన్యాస సంప్రదాయం వల్ల మాత్రం కాదు.

ఏ ప్రాచీన ‘స్వామి’ పరంపరలో పరమహంస యోగానందగారు ప్రవేశించారో అది ఈ రోజున యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసుల సంఘాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల సన్యాసులతో వర్ధిల్లుతోంది. ఈ సన్యాసుల పరంపర వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రపంచవ్యాప్త ఎదుగుదలకు కారణమయ్యింది మరియు అన్ని దేశాలలో యోగా యొక్క విస్తృత వ్యాప్తికి సహాయపడుతోంది.

ఇటీవల జరిగిన సన్యాస దీక్షా వేడుకలు

మార్చి 21, 2024, గురువారంనాడు, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలోని ప్రధాన ప్రార్థనా మందిరంలో జరిగిన వేడుకలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ఇద్దరు సన్యాసులు మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు చెందిన పదకొండు మంది సన్యాసులు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి నుండి సన్యాసం యొక్క అంతిమ దీక్షను స్వీకరించారు.

పరమహంసగారు తన ఒక యోగి ఆత్మకథ (“నేను సన్యాసం తీసుకోవడం” అనే అధ్యాయం) లో వివరించినట్లుగా సన్యాసం యొక్క అంతిమ ప్రమాణాలను ఒక సన్యాసి స్వీకరించినప్పుడు (చాలా సంవత్సరాల సన్యాస శిక్షణ మరియు స్వీయ-క్రమశిక్షణ తరువాత), అతనికి లేదా ఆమెకు ఒక నిర్దిష్ట దైవ గుణము ద్వారా భగవంతునితో ఐక్యత లేదా అనంతమైన ఆనందాన్ని పొందాలనే ఆకాంక్షను సూచించే విధంగా ఒక క్రొత్త పేరును ఇవ్వడం జరుగుతుంది.

మార్చి 21న దీక్షా ప్రమాణ వేడుకలు ముగిసిన కొద్దిసేపటి తరువాత తీసిన క్రొత్త సన్యాసుల చిత్రం క్రింద ఉంది.

నిలబడినవారు, ఎడమ నుండి: స్వాములు అసిమానంద, గణేశానంద, మరియు బోధానంద; వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి; స్వాములు సంజయానంద, శాంతిమోయ్, మరియు పుణ్యానంద. కూర్చున్నవారు, ఎడమ నుండి: స్వాములు శంకరానంద; శరణానంద, యోగేశానంద, సఖ్యానంద, విద్యానంద, మైత్రిమోయ్ మరియు నిర్మలానంద.

సన్యాసుల క్రొత్త పేర్లకు అర్థాలు

స్వామి అసిమానంద: అనంతంతో ఏకత్వం ద్వారా పొందే ఆనందం; స్వామి గణేశానంద: జ్ఞానం మరియు విజయం చేకూర్చే దేవునికి భక్తి ద్వారా పొందే ఆనందం, “అడ్డంకులను తొలగించేవాడు”; స్వామి బోధానంద: జాగృతమైన భగవంతుని అవగాహన ద్వారా పొందే ఆనందం; స్వామి సంజయానంద: తనపై సంపూర్ణ విజయం ద్వారా పొందే ఆనందం, అది దివ్య అంతర్ముఖ దృష్టిచే ప్రసాదించబడుతుంది; స్వామి శాంతిమోయ్: శాంతిలో లీనమైన (లేదా ఉండాలని కోరుకునే) వ్యక్తి, దివ్య శాంతి; స్వామి పుణ్యానంద: పుణ్యకార్యాల ద్వారా పొందే ఆనందం; స్వామి శంకరానంద: దయాళువైన ఈశ్వరుడి ద్వారా పొందే ఆనందం; స్వామి శరణానంద: దైవంలో రక్షణ లేదా ఆశ్రయం పొందడం ద్వారా లభించే ఆనందం; స్వామి యోగేశానంద: యోగ ప్రావీణ్యత ద్వారా పొందే ఆనందం; స్వామి సఖ్యానంద: ఈశ్వరుణ్ణి సన్నిహిత స్నేహితునిగా ప్రేమించడం ద్వారా పొందే ఆనందం; స్వామి విద్యానంద: దేవుని దివ్య జ్ఞానం మరియు విజ్ఞానం ద్వారా పొందే ఆనందం; స్వామి మైత్రిమోయ్: ప్రేమపూర్వక దయలో వ్యాపించడం; స్వామి నిర్మలానంద: స్వచ్ఛత ద్వారా పొందే ఆనందం.

పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కార్యాన్ని కొనసాగించడం

దైనందిన క్రియాయోగ ధ్యాన సాధనతో పాటు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సన్యాసులు, వివిధ హోదాలలో సేవలందించడం ద్వారా పరమహంసగారి ఆధ్యాత్మిక కార్యాన్ని మరింతగా ముందుకు తీసుకువెళుతున్నారు — భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు పరిసర దేశాలలో బహిరంగోపన్యాస పర్యటనలు మరియు తరగతులను నిర్వహించడం; సాధనా సంగమాలలో ఉపన్యాసాలు ఇవ్వడం; బాహ్యవ్యాప్తి (బహిరంగ) కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధించడం; కార్యాలయంలో పని చేయడం; యోగదా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలను నిర్వహించడం; వై.ఎస్.ఎస్. పుస్తకాలు మరియు రికార్డింగ్‌ల ప్రచురణ మరియు పంపిణీని పర్యవేక్షించడం; మరియు ఆధ్యాత్మిక విషయాలపై సలహాలు కోరేవారికి సహాయపడడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సన్యాసులు నిర్వహిస్తారు.

పరమహంస యోగానందగారి ఆశ్రమాలలోని సన్యాసుల జీవన ప్రయాణంలోని వివిధ దశల గురించి మా వెబ్‌సైట్‌లోని “సన్యాస పరంపర” విభాగంలో మరింతగా తెలుసుకోవచ్చు.

ఇతరులతో పంచుకోండి